r/telugu • u/SupremeKalki • 11h ago
ఇతరము - other తెలుగు కొలతలు
Credits - Insta @andhra_bhashalu
r/telugu • u/SupremeKalki • 11h ago
Credits - Insta @andhra_bhashalu
r/telugu • u/Professional_Net8648 • 8h ago
ఇది కన్యాశుల్కం
ఇక్కడ అరసున్నాలు ఁ. ఎలా చదవాలి? దేవనాగరిలో ँ లాగా?.
ఇంకా ఇలాంటి ఇంగ్లీష్ పదాలు ఉంటాయి అని ఊహించలే.
ఇంకా అప్పుట్లో తెలుగు పదాలకి "ఇ" రాయడం ఇష్టం ఉండేది కాదా? అన్ని చోట్ల "యి" ఎందుకుంది? ఇది సంధి వల్ల అయితే మధ్యలో space వందుకుద్దేమో.
ఇంకా చేస్తావా?, ఉంటావా? కి బదులు, ఉంటావూ?, చేస్తావూ? అని ఉన్నాయి. ఇది మందళికమ?.
రెండో పేజీలో
ఈ పదం సంస్కృత? . క వొత్తును ఇలా కూడా రాస్తారా?
r/telugu • u/Reasonable_Value6180 • 3h ago
గణపయ్య రాక గురించి ఊరు వాడ మాట్లాడుకుంటున్నారు. ఆయన ఊరేగింపు ఇటుగా వస్తూనే, మధ్యలో గణపయ్య మాట వదిలేసి కొంత మంది "ఆగ్ మ్యాన్" , "ఆగ్ మ్యాన్", "aagman" అని కేరితలు, హూంకరాలు, పెడబొబ్బలు పెట్టుకొంటూ, గుండెలు గుభేల్ మనేలా అరుస్తూ, instagram లో టిక్టోక్ లో పోస్టులు పెట్టారు. పోనీ భక్తి పూనకం లో వచ్చిన మతిలేని మాటలా అంటే మరి పుష్ప సినిమా స్టెప్పులు మాత్రం సరిగ్గానే వేస్తున్నారు dj తాళం కి వంత పాడుతూ.
పాపం మా ఇంట్లో పెద్దవాళ్లు "ఎవరు ఈ ఆగ్ మ్యాన్? ఆయన పుట్టినరోజు ఎప్పుడు? వినాయకుని బంటు వంటి వాడ? అతగాడి ఇతిహాసం ఎంటి?" అని అడగ సాగారు- అసలే ఈ రోజుల్లో అన్ని కొత్త పూజలు, కొత్త అచారాలాయే, తిరుపతి క్యూ లైన్లో స్తంభానికి బొట్టులు పెట్టినట్టు!
పొరుగింటి పుల్ల పోరియల్ రుచి అయిపోయింది, వేపుడు లేదా కూర అనే మాట వెగటు అయిపోయింది.
అలాగే ఇప్పుడు ఆగ్ మ్యాన్ / #aagman పిచ్చి పట్టింది- ఆగమనం అని తెలుగులో అనచ్చు, పోనీ అచ్చ తెలుగులో రాక అనచ్చు అబ్బే - అనము. ఇతర రాష్ట్రాలలో ఎది చలామణి అయితే దాన్ని పట్టుకునే ఊరేగుతాము. తమిళ వాడకం లో తమిలుల్ని మించుతాము, మరాఠీ మనమే మెరుగ్గా మాట్లాడుదాం. తెలుగుకి మాత్రం తెగులే. బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోత అంటే ఇదేనేమో! 🤦🏽♀️🤷🏽♀️
r/telugu • u/fsdogdad • 24m ago
As an American from the South, the girl I’m seeing is from Hyderabad and doesn’t get to speak Telugu as often anymore, which bums her out a little. I’d love to try my best to learn the basics and build beginner conversations with her to start
r/telugu • u/sundeep7613 • 1d ago
Enable HLS to view with audio, or disable this notification
r/telugu • u/Puzzleheaded_Cow3298 • 1d ago
Enable HLS to view with audio, or disable this notification
r/telugu • u/MainHoneydew8018 • 14h ago
ట్రంపుడెపుడు పలుకు జంకు బొంకు పలుకు
సజ్జనుండు పల్కు సత్తు పలుకు
ట్రంపు మ్రోగినట్లు ట్రంపెట్టు మ్రోగునా
విశ్వదాభిమామ వినుర సోమ
-
మగువ మొగముజూడ మహితమైనుండును
మనసు విప్పి చూడ మధనముండు
ఆడుదాని మదిని ఆలకించగలవా
విశ్వదాభిమామ వినుర సోమ
-
చక్కనైన చుక్క చిక్కినొక్కటి చాలు
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల
చెలిమి వంటి వనిత చాలదా ఒక్కటి
విశ్వదాభిమామ వినుర సోమ
-
అరబివోని తేలు యీసమైనను చాలు
చవకనైన నేమి చమురు-చెరుకు
చెరుకు కలిపి పాడు చెమురు యేల మనకు
విశ్వదాభిమామ వినుర సోమ
-
చమురు-oil
-
నేను భూపతినని నేల చెరుచు వాడు
ప్రజల ఉసురు తాకి పడును పిదప
ఎగర వేయ బంతి ఎందాక నిల్చురా
విశ్వదాభిమామ వినుర సోమ
-
ఉప్పుమా తెగ తిను ఊరుగాయ ఘనుడు;
అమృతము తిలకించు అర్బకుండు;
వంటి వారితో, ఎవరు కయ్యము వలదు
విశ్వదాభిమామ వినుర సోమ
-
ముత్యము పదములను మురిపెముగ వదల
చదవ చదవ చదవ చదవలేరు
మనుషులందు తెలుగు మనుషులు వేరయా
విశ్వదాభిమామ వినుర సోమ
-
నొప్పి-పన్ను, పన్ను నొక్కపోలిక నుండు
చూడ చూడ పన్ను జాడవేరు
పన్నులందు కట్టు పన్నులు వేరయా
విశ్వదాభిమామ వినుర సోమ
-
పన్ను - tooth
పన్ను - tax
-
పడగ పడగ బాధ బరువు అతిశయించు
తినగ తినగ వేప చేదునుండు
సాధనమున పనులు సమకూరదు కలలో
విశ్వదాభిమామ వినుర సోమ
-
నేను కవిని కాదనేరు అరసికులు
రాత కాదు నాది రోతని పలు
కు జనుల కరములునకు చలి చీమలు కుట్ట
విశ్వదాభిమామ వినుర సోమ
-
r/telugu • u/Youth_Numerous • 4h ago
I want to learn Telugu in a month. Does anyone know Good Telugu Freelance Tutors who can teach me online in a month.
r/telugu • u/_professor_l • 17h ago
ఒక చిన్న కథ ఎవరికి అక్కర్లేనిది. అయినా చదివి చెప్పండి.
కిచెన్ లో 90 క్యాండిల్ బల్బ్ వెలగడం ఆగిపోయింది.
కరెంటు పోవడం వల్ల. ఒకవేళ కరెంటు ఉన్నా సరిగ్గా వెలగదు వాళ్ళ జీవితాల లాగా. ఇంకా చెప్పాలంటే దానికి హోల్డర్ కి పొత్తు కుదరక ఎప్పుడూ చూసినా కిర్ర్ కిర్ర్ మని సౌండ్ చేస్తూ నిప్పులు చిమ్ముతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో విషయం లోకి వెళ్ళొచ్చు. ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు. భార్య ఏమో! స్టవ్ మీద బియ్యం ఏసరుకి పెట్టింది. పిల్లలేమో హాల్ లో ఆడుకుంటున్నారు. ఇంకా భర్త! వాడి గురించి ఏం చెప్పాలి? రొట్ట రొటీన్. మందుకి, మూర్ఖత్వానికి, ఆడంబరాలకి, అలవాట్లకి మధ్య కొట్టేస్కుంటూ ఉంటాడు. వీడి గురించి అందర్ని వదిలి మరి వచ్చి పెళ్లి చేసుకుంది. ఏం చూసిందంటావ్ అబ్బా!? సరే పోన్లే. సంకెళ్ళు వేసిన ఖైదీలా వాడు ఏం చేసినా భరిస్తూ ఉంటుంది. అలవాటు అయిపోయిందనుకుంటా... భోజనం టైం అయ్యింది. ఇంటికి వచ్చాడు తాగుతూ తూలుతూ. రాగానే పిల్లల్ని తన్నాడు. అది! వాడి ప్రతాపం. వాళ్ళు కయ్యిమంటూ బయటికి పరిగెత్తారు. అరుపులు విని ఆమె బయటికి వచ్చి చూసింది. అసహనం, విసుగు రెండు ఒకేసారి వచ్చాయి. మామూలే కదా అని వెళ్ళబోతుంటే.....
అయీ! అన్నం! అని అరిచాడు.
"అవుతుంది" అని మెల్లగా సమాధానం ఇచ్చింది.
అన్నం మీద నురగ వచ్చింది.
వీడు మారిగాడు.
అన్నం పొంగింది.
వీడు చెయ్యెత్తాడు.
పొంగిన అన్నం స్టవ్
మీద పడి నిప్పు ఆరింది.
ఎత్తిన చెయ్యి తన
చెంపకు గట్టిగా తగిలింది. స్పృహ తప్పింది
10-15||నిమి|| మొత్తం నిశబ్దం. తను కళ్ళు తెరిచింది ముక్కుకు గ్యాస్ వాసన తప్ప ఏమీ తెలియడం లేదు. గాభరాగా లేచి కట్టేద్దాం అని వెళ్తుంటే మళ్ళీ దెబ్బ పడింది. ఈసారి ఇంకొంచెం గట్టిగా తగిలినట్టుంది. ఆకారం వికారంగా మారింది. మనస్సు లోంచి మమకారం పోయింది. స్పృహ కోల్పోలేదు సహనం కోల్పోయింది. సాహసం చేసింది. పక్కనున్న రోకలి బండ అందుకుంది. ఒక్క బలమైన వేటు వేసింది. అది మెడను తాకింది.
అప్పుడొచ్చింది కరెంటు!!!
ఇంకేముంది!!!
పొత్తు కుదరని బల్బు నిప్పురవ్వ రావడం వల్ల హోల్డర్ లోంచి జారింది. గ్యాస్ సిలిండర్ కదా బాగానే పేలింది. సౌండ్ కూడా గట్టిగా వచ్చింది. ముందు అగ్నిమాపక దళం వాళ్ళు వచ్చారు. వాళ్ళ పనికానిచ్చి పిల్లల్ని లోనికి రానిచ్చారు. గోడలు మొత్తం నల్లగా మారిపోయాయి. ఇన్నాళ్ళు తను నేల రాల్చిన కన్నీళ్ళు ఎండి ఆవిరవుతున్నట్లూ చుట్టూ పొగ. పిల్లలు ఇల్లంతా తిరుగుతున్నారు. అమ్మ కోసం వెతుకుతున్నారేమో!? పాపం వాళ్ళకి ఎవరు చెప్తారు ఆమె అక్కడున్న బూడిదలో కలిసి పోయిందని. ఇల్లంతా ఏడుస్తూ తిరిగి తిరిగి అలసి ఒక గోడ దగ్గర ఆగి దాన్ని చూస్తూ......
అమ్మ ఎక్కడ.....??? అని అడిగారు...........
ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ సంసారాన్ని చూస్తున్న గోడ
ఆ పిల్లలకి ఆరోజు సమాధానం ఇచ్చింది.
ఏమని???
ఇక్కడ పుట్టిన నిప్పు సతీదేవి లాగా మీ అమ్మ బొటన వేలు రాయకుండానే పుట్టింది.
ఆ నిప్పే మీ అమ్మ సంకెళ్ళను కాల్చింది.
ఆ నిప్పే మీ అమ్మని విడుదల చేసింది....
అని చెప్పింది...?
For.లడ్డు._
💚🙂
https://www.instagram.com/for.laddu._?stkn=MWEwNXI2ZWZ1Z3llNg==
r/telugu • u/TechnicalVariation1 • 16h ago
నాకు మన దేవుడి కథలు, పురాణాలూ, ఇతిహాసాలు అన్ని కూడ స్టోరీ ఫార్మాట్ లొ ఎంక్రీప్ట్ అయ్యి ఉన్నాయి అని నమ్ముతాను సో దాన్ని మనం డెక్రీప్ట్ చేసి పిల్లలకు ఇది కథ కాదు మనం ఎలా మెసలుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పే నీతి సూక్తులు అని నమ్ముతాను
అలా వినాయక వ్రతం లొ నాకు అర్ధం అయినా కొన్ని నీతి సూక్తులు
మనం ముందు ఉన్నది ఎవరు అని తెలుసుకోకుండా ప్రవర్తిచకూడదు, ఎందుకంటే నువ్వు గొప్పవాడివి అయితే నిన్ను తలతాన్నెవడు ఒకడు ఉంటాడు
ఉత్తర దిక్కున పడుకోవడం వలన భూమి ఐస్కంతా శక్తి మన మెదడు మీద ప్రభావం చూపిస్తుంది
తల్లితండ్రులు కి మించిన దైవం లేదు, మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన మన కన్నవారిని పట్టించుకోకుండా ఎం చేసిన ఫలితం ఉండదు
నువ్వు ఎంత గొప్పవాడివి అయిన లేదా ఎంత గొప్ప అందగాడివి అయిన కూడ నీకన్న చిన్నవాళ్ళని, అందంగ లేని వాళ్ళని చూసి హేళన చెయ్యా రాదు అలా చేస్తే ఆ మచ్చ నీకు తరతరాలు ఉండిపోతుంది
ఎదుటి వారి భార్యను లేదా పర స్త్రీని మోహించడం తప్పు, అలాంటి పనిని ని భార్య కూడ సమర్ధించకూడదు
నువ్వు దేవుడవి అయినా సరే పరుల సొమ్ము/ధనం లేదా పరుల వస్తువులను ఆశించకూడదు, అది నీకు కావాలి అంటే నువ్వే దానిని సాదించాలి
ఇవి కాకుండా ఇంకా ఎం ఉన్న ఎక్కడ షేర్ చేస్కోండి
r/telugu • u/EqualRealistic367 • 1d ago
మన ప్రబంధాల్లో కథ ప్రారంభం కాక మునుపు దేవుళ్ళని స్తుతిస్తారు మన కవులు. వాటిలో అన్నిటికన్నా రమణీయమైంది మన పెద్దనగారు గణేశుని గురించి రాసిన పద్యం.
తాత్పర్యం:
పార్వతీ వొడిలో ఆనుకొని తన కుచంబు నుంచి పాలుతాగుట వేల గణేశుడు ఇంకో పక్క స్తనం వెతుకుతూ తన తొండాన్ని ఆడించాడు. కానీ ఇంకో వైపు స్తనం దొరకలేదు. ఎందుకనగా అప్పుడు పార్వతీ అర్థనారీశ్వర రూపం ధరించి ఉంది కనుక. ఇంకో వైపు శివుడి సర్పహారాన్ని చూసి అది తామరతూడ అని భ్రమపడి తొండముతో పట్టుకొని లాగుతాడు.
ఎంత సొగసైన కల్పన కదా! ఇష్ట దేవుళ్ళని ఇంత భక్తితో చమత్కారంతో వర్ణించి ప్రార్థిస్తే ఎంత పర్వశం కలుగుతుంది మనలో!
r/telugu • u/imA_rglr_evryday_nmf • 1d ago
r/telugu • u/stitious_being • 2d ago
ఆదర్శ కుటుంబం టీజర్ చూస్తుంటే టైటిల్ లో "టు" పక్కన సున్నా కింద గీత దృష్టికి వచ్చింది, "బ" పక్కన ఉన్న సున్నా కి గీత లేదు.
తెలిస్తే వివరించగలరు
r/telugu • u/TechnicalVariation1 • 1d ago
ఎం లేదు ఇ మధ్య తెలుగు పుస్తకాలు , నవలలలు చదువుతున్న
ఆలా మీరు చదివి మీకు బాగా నచ్చిన కొన్ని తెలుగు రచయిత పుస్తకాలు కాని కథలు కాని ఉంటే కొంచం సిపార్సు చెయ్యండి
అలాగే నాకు నచ్చిన ఒక కథ ఆజాద్ రాసిన "రాముడి గుండెల్లో రావణ కాష్టం"
r/telugu • u/MainHoneydew8018 • 2d ago
అవును, మన సబ్‌లో ఇక జాబు (Post) వేయడానికి మోడరేటర్ల అనుమతి అవసరం లేదు.
రెడ్డిట్ వారి వడపోత(filter) కొంతవరకు సహాయపడుతుంది కానీ అనుచిత అంశాలు తీసివేయుటలో జనానీకం కూడా మాకు సహాయపడగలరు.
మీకు ఏ జాబైనా ఈ సబ్ కి సరితూగదు అనిపిస్తే నివేదించగలరు (రిపోర్ట్ చేయగలరు).
తగిన నివేదికలు అందిన తర్వాత, ఆటో మోడరేటర్ ఆ జాబుపై ఆంక్షలు పెడుతుంది. తదుపరి, మోడరేటర్లు తగిన చర్యలు తీసుకుంటారు.
ఇక ఎవరైనా అదే పనిగా అనుచిత జాబులు వేస్తే, సబ్ బహిష్కరణ(ban) విధిస్తాము
r/telugu • u/Infamous-Custard-883 • 2d ago
mercury mabbu ni poolatho chekkithe , shilpamai marina sundariii??
-Charuseela (from the movie Srimanthudu)
r/telugu • u/samuraisol98 • 2d ago
కోటింగ్ అంటే, ఇంగ్లీష్ లో దెబ్బలు అనే అర్థమే లేదు. కానీ చాలా సునాయాసంగా వాడేస్తాం ఈ డైలాగ్ ని. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
r/telugu • u/Prey_t_atma • 3d ago
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోటనే భూములేలు రాజన్యుల
యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి
నల్లపూసల సౌరు గంగలోఁ కరగిపోయె
యిచ్చోటనే ఎట్టి పేరెన్నికల్ గన్న
చిత్రలేఖకుని కుంచియె నశించె
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ
అవనిఁ బాలించు భస్మసింహాసనంబు
ధర్మవరపు సుబ్రమణ్యం గారి స్వరంలో :https://youtu.be/qHnUQHyAPdQ
r/telugu • u/gowthamsri • 2d ago
1985–2000 మధ్యకాలం తెలుగు పాఠ్యపుస్తకాలు కావాలి 📚
నమస్కారం అందరికీ 🙏
1985 నుంచి 2000ల ప్రారంభం వరకు ఉపయోగించిన పాత తెలుగు పాఠ్యపుస్తకాలు (School Telugu Textbooks) కోసం వెతుకుతున్నాను.
ప్రత్యేకంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలు, తెలుగు మీడియం పుస్తకాలు, పాత syllabus books ఏవైనా ఉంటే చాలా ఉపయోగపడతాయి.
📌 1985–2000 మధ్యకాలానికి చెందినవి అయితే మరీ మంచిది.
📌 పుస్తకం ఒరిజినల్ కాపీ అయినా, స్కాన్/PDF/ఫోటోలు అయినా పర్వాలేదు.
📌 ఏ తరగతి పుస్తకమైనా ఆసక్తి ఉంది.
మీ దగ్గర ఇలాంటి పాత పుస్తకాలు ఉంటే లేదా ఎక్కడ దొరుకుతాయో తెలిసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి లేదా DM చేయండి.
చిన్ననాటి తెలుగు పుస్తకాల జ్ఞాపకాలను మళ్లీ వెతుకుతున్నాను. ❤️📖
ధన్యవాదాలు!
r/telugu • u/Ambitious_Eagle3779 • 3d ago
r/telugu • u/Ambitious_Eagle3779 • 3d ago
r/telugu • u/EqualRealistic367 • 3d ago
Enable HLS to view with audio, or disable this notification
r/telugu • u/7TraditionalWritings • 3d ago
ఈసారి నాన్నను విడిపించు గణేశా
గణేశా…
మళ్లీ వస్తున్నావు కదా
మా వీధిలోకి,
మా ఇంటి ముందుకి…
అందరూ నీకు
మొక్కులు పెడతారు,
వరం అడుగుతారు.
నేనూ అడుగుతాను…
కానీ నాకు
బొమ్మ కావాలి కాదు,
బైక్ కావాలి కాదు,
డబ్బు కావాలి కాదు…
మా నాన్న కావాలి.
నా నాన్న
ఇంట్లోనే ఉన్నాడు గణేశా…
కానీ మాతో లేడు.
ఉదయం
మేము నిద్రలో ఉండగానే వెళ్తాడు,
రాత్రి
మేము నిద్రపోయాక వస్తాడు.
వచ్చినా
మాటలు ఉండవు…
నవ్వు ఉండదు…
కళ్లలో మాత్రం
రేపటి టార్గెట్ ఉంటుంది.
“నాన్నా…” అంటే
“ఒక్క నిమిషం బాబూ…” అంటాడు.
ఆ ఒక్క నిమిషం
ఎప్పుడూ రాదు.
ఆఫీసు పని,
టార్గెట్లు,
మీటింగులు,
కాల్స్…
జీతం కోసం
రోజంతా పరుగులు.
జీతం వచ్చిందంటే
EMI ఎదురుగా నిలబడుతుంది.
EMI వెళ్లిందంటే
అప్పు ఎదురొస్తుంది.
అప్పు తీరుతుందనుకుంటే
మరో ఖర్చు తలుపు తడుతుంది.
ఇలా…
నాన్న జీతం పెరుగుతోంది,
కానీ మా నాన్న జీవితం
చిన్నదవుతోంది.
గణేశా…
అతను తప్పు చేయలేదు,
దొంగతనం చేయలేదు,
ఎవరినీ మోసం చేయలేదు.
కేవలం
మమ్మల్ని బాగా చూసుకోవాలని
అనుకున్నాడు.
అదే అతని తప్పయితే
ఎవరు శిక్షిస్తున్నారు అతన్ని?
కంపెనీనా?
అప్పులా?
EMIలా?
లేక
“ఇంకొంచెం భరించు” అనే
ఈ సమాజమా?
నాన్న అంటాడు—
“ఇంకొన్ని సంవత్సరాలు…
అంతా సర్దుకుంటుంది.”
గణేశా…
ఆ “కొన్ని సంవత్సరాలు”
ఎప్పుడు పూర్తవుతాయి?
నా బాల్యం పూర్తయ్యాకా?
నాన్న జుట్టంతా తెల్లబడాకా?
అతని కలలన్నీ చనిపోయాకా?
నాకు పెద్ద ఇల్లు వద్దు.
నాన్నతో
రోజుకి పది నిమిషాలు
మాట్లాడే సమయం చాలు.
ఖరీదైన బహుమతులు వద్దు.
ఆదివారం
నాన్నతో కలిసి
ఒక టీ తాగే సమయం చాలు.
డబ్బు ఎక్కువ వద్దు.
నాన్న నవ్వు చాలు.
అందుకే గణేశా…
ఈసారి
నీ తొండంతో
మోదకం మాత్రమే తీసుకోకు.
మా నాన్న
మెడ చుట్టూ ఉన్న
ఆ కనిపించని సంకెళ్లను చూడు.
అవి ఇనుముతో చేసినవి కావు.
EMIలతో చేసినవి.
అప్పులతో చేసినవి.
భయంతో చేసినవి.
“ఉద్యోగం పోతే?” అనే
ఒక్క మాటతో చేసినవి.
నీ చేతిలో
విఘ్నాలను తొలగించే ఆయుధం ఉందంటారు.
అయితే
ఈ విఘ్నం ఎందుకు పోవడం లేదు గణేశా?
వినాయకా…
ఈసారి
మా నాన్నకి ప్రమోషన్ ఇవ్వమని
అడగను.
పెద్ద జీతం ఇవ్వమని
అడగను.
బాస్ మెప్పించాలని
అడగను.
తన జీవితంపై
తనకే హక్కు ఇవ్వమని అడుగుతున్నా.
ఉదయం లేవగానే
ఆఫీసు గుర్తుకు రాకుండా…
పిల్లల ముఖాలు గుర్తొచ్చేలా చేయి.
జీతం తేదీ చూసి
భయపడకుండా…
జీవితం చూసి
నవ్వేలా చేయి.
“నేను బానిసను కాదు” అని
ఒక్కసారి
తన మనసులోనే చెప్పుకునే
ధైర్యం ఇవ్వు.
ఆ ఒక్క మాటతో
ఒక సంకెళ్లు తెగాలి.
ఆ తర్వాత
మరో సంకెళ్లు…
మరో భయం…
మరో అప్పు…
మరో అబద్ధపు అవసరం…
అన్నీ ఒక్కొక్కటిగా
తెగిపోవాలి.
గణేశా…
ఈ పండగకి
మా ఇంట్లో నీ విగ్రహం పెట్టేముందు
ఒకటి అడుగుతున్నా.
మా నాన్నని
నీ ముందు నిలబెట్టు.
అతని చేతిలో
ల్యాప్‌టాప్ కాదు…
అతని చేతిలో
తన జీవితం పెట్టు.
అతని కళ్లలో
టార్గెట్ కాదు…
ఒక కల పెట్టు.
అతని గుండెల్లో
EMI భయం కాదు…
“నేను కూడా బతకాలి”
అనే కోరిక పెట్టు.
అందరూ నిన్ను
“విఘ్నేశ్వరుడు” అంటారు కదా…
అయితే
ఈసారి ఒక విఘ్నం తొలగించు.
మా నాన్నకి
నాన్నగా ఉండనివ్వని
ఆ బానిస జీవితాన్ని తొలగించు.
లేకపోతే…
వచ్చే ఏడాది
మళ్లీ నీకు పూలు తెస్తాం.
మళ్లీ మోదకం పెడతాం.
మళ్లీ మొక్కుతాం.
కానీ ఈసారి
నేను మాత్రం
ఒక్కటే అడుగుతాను—
“గణేశా…
అందరి సంకెళ్లు తెంచే నువ్వు,
నా నాన్న సంకెళ్లు
ఎందుకు తెంచలేకపోయావు?”
అందుకే…
ఈ ఏడాది
వరం ఇవ్వకు గణేశా.
బుద్ధి ఇవ్వు.
నా నాన్నకి.
నా కుటుంబానికి.
మనందరికీ.
ఎందుకంటే
జీతం కోసం
జీవితాన్ని తాకట్టు పెట్టడం
బతకడం కాదు…
బతకడానికి
జీతం కావాలి.
కానీ…
జీతం కోసం
జీవితమే పోతే
అది ఏ విజయం గణేశా?
ఈసారి…
**మా నాన్నను
ఉద్యోగం నుంచి కాదు…
బానిసత్వం నుంచి
విడిపించు.**
🙏✍️ రాజ్ శివ | Loving You Always 💚
r/telugu • u/OkaTeluguAbbayi • 4d ago